పాపం.. నీటిలో ప్రజల జీవనం

by Shyam |
పాపం.. నీటిలో ప్రజల జీవనం
X

దిశ, మానకొండూరు: మానకొండూరు మండలంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. పంటపొలాలు నీట మునగగా కొన్ని గ్రామాల్లో ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు జలంలోనే జీవనం సాగిస్తున్నారు. మండలంలోని ఊటురు, దేవంపల్లి, వేగురుపల్లి, లింగాపూర్, శ్రీనివాస నగర్, లలితాపూర్, అన్నారం గ్రామాల్లోని సుమారు 500 ఎకరాలు వరి పంట నీట మునగింది. అయితే అన్నారం గ్రామంలో కొన్ని ఇళ్లలో వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆ గృహాల్లో నివసిస్తున్న వారు ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న సర్పంచ్ బొట్ల కిషన్ ఆ నీటిని మోటారు సాయంతో ఎత్తిపోయిస్తున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో నీటిని తరలించడం ఇబ్బందిగా మారింది.

Advertisement

Next Story