టిక్‌టాక్‌లో ‘ఫ్లిప్ ద స్విచ్’ చాలెంజ్ వైరల్

by Shyam |   ( Updated:2023-06-13 16:49:51.0  )
టిక్‌టాక్‌లో ‘ఫ్లిప్ ద స్విచ్’ చాలెంజ్ వైరల్
X

‘టిక్ టాక్’ .. జనాన్ని పూర్తిగా తన మాయలో పడేసింది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ‘టిక్‌టాక్‌’ ప్రపంచంలో గడిపేస్తున్నారు. కాస్తంత టైం దొరికితే చాలు స్కూల్ పిల్లలు, కాలేజీ స్టూడెంట్స్, ఇంటి పట్టున ఉండే మహిళలు, ఆఫీస్‌లో ఎంప్లాయీస్, చివరికి ముసలివారు కూడా ‘టిక్‌టాక్‌’కు జై కొడుతున్నారు. ఎందుకు ఇలా అంటే అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అంటున్నారు. ఎంతోమందికి నటులుగా తమ ప్రతిభను ప్రదర్శించాలనే కల ఉంటుంది. అలాంటి వాళ్లకు టిక్‌టాక్ ఒక ఫ్లాట్ ఫాంలా ఉపయోగపడుతుంది. అవకాశాలను కూడా తెచ్చిపెడుతుంది. అదే సమయంలో ‘టిక్‌టాక్‌’కు బానిసై జీవితాలను పోగొట్టుకునే వారు కూడా లేకపోలేదు. అంటే ప్రతి విషయంలోనూ మంచి, చెడు ఉన్నట్లే టిక్ టాక్ విషయంలోనూ అంతే.

‘ఫ్లిప్ ద స్విచ్’ చాలెంజ్

ఎప్పుడూ ఏదో ఒక ట్రెండ్ నడిచే సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘టిక్‌టాక్‌’లో ఇప్పుడు ‘ఫ్లిప్ ద స్విచ్’ చాలెంజ్ నడుస్తోంది. ఈ చాలెంజ్‌లో ఇద్దరు వ్యక్తులు ఉండాల్సి వస్తోంది. ఒకరు అద్దం ముందు నిల్చుని వీడియో రికార్డ్ చేస్తుంటే మరొకరు డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి వీడియో రికార్డ్ చేస్తున్నవారు డ్యాన్స్ చేస్తుంటే… డ్యాన్స్ చేసేవారు రికార్డ్ చేయాలి. అంటే ఫ్లిప్ అవ్వాలి. ఈ క్రమంలో వారిద్దరి డ్రెస్సెస్ కూడా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది.

చాలెంజ్ స్టార్ట్ చేసింది ఎవరు?

‘ఫ్లిప్ ద స్విచ్’ చాలెంజ్ బెల్లా, డాలిన్ లాంబర్ట్ అనే ఇద్దరు దంపతులు స్టార్ట్ చేశారు. @dallinxbella టిక్‌టాక్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేసి చాలెంజ్ చేయగా… ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. 15 సెకండ్ల ఫ్లిప్ ద స్విచ్ చాలెంజ్‌ను వరల్డ్ వైడ్‌గా సెలబ్రిటీస్ కూడా స్వీకరిస్తున్నారు. టిక్‌టాక్‌లో మాత్రమే కాదు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలోనూ షేర్ చేస్తున్నారు. జెన్నీఫర్ లోపేజ్, అలెక్స్ రోడ్రిగ్యూజ్ సైతం ఈ చాలెంజ్‌ను ఎంజాయ్ చేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా మరింత మంది ట్రై చేస్తున్నారు. తాజాగా దక్షిణాదిలో గుర్తింపు పొందిన బాలీవుడ్ భామ సమీరారెడ్డి తన అత్తతో కలిసి ఫ్లిప్ ద స్విచ్ చాలెంజ్ చేశారు. క్వావో పాటకు ఇద్దరూ డ్యాన్స్ చేయగా… ఈ చాలెంజ్ కోసం అత్తను ఎంచుకున్న సమీరాను అభినందిస్తున్నారు నెటిజన్లు. కోడలిని మించిన స్టెప్పులతో అదరగొట్టిందంటూ అత్తపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అత్తాకోడళ్లలా కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్‌లా కనిపిస్తున్నారని .. మీ వీడియో చాలా క్రేజీగా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

Advertisement

Next Story