- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
6 నగరాల నుంచి కోల్‌కతాకు విమానాలు రద్దు
by Shamantha N |
X
కోల్‌కతా: కరోనా మహమ్మారిని అదుపులోకి తెచ్చేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పలురకాల చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి రాష్ట్ర రాజధానికి విమానాలను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఢిల్లీ, ముంబయి, పూణె, నాగ్‌పూర్, చెన్నై, అహ్మదాబాద్‌ల నుంచి కోల్‌కతాకు విమాన సేవలను రద్దు చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. బెంగాల్ సర్కారు విజ్ఞప్తిని స్వీకరించి నిర్దేశించిన నగరాల నుంచి కోల్‌కతాకు విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
Advertisement
Next Story