- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హుస్సేన్ సాగర్‌లో ఐదుగురు మహిళలు ఆత్మహత్యాయత్నం
దిశ, బేగంపేట: వేరు వేరు కారణాలతో వేరు వేరు ఘటనల్లో హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు మహిళలను లేక్ పోలీసులు కాపాడారు. ఇన్ స్పెక్టర్ ధనలక్ష్మి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్ చెరువుకు చెందిన ఓ మహిళ కల్లుకు బానిసైంది. కల్లు తాగి వచ్చి రోజూ ఇంట్లో న్యూసెన్స్ చేస్తుంది. కల్లుకు బానిసైన ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. చనిపోవాలని భావించిన ఆమె శుక్రవారం ఉదయం 6.45 గంటల సమయంలో ట్యాంక్ బండ్ పై గల లేపాక్షి ప్రాంతానికి చేరుకుని హుస్సేన్ సాగర్‌లోకి దూకేందుకు యత్నిస్తుండగా.. లేక్ పోలీసులు కాపాడారు.
అలాగే అత్తాపూర్, ఏవోసీ తిరుమలగిరికి చెందిన ఇద్దరు మహిళలకు భర్తల నుంచి వేధింపులు వస్తున్నాయి. దీంతో చనిపోవాలని నిశ్చయించుకున్నారు. ఒకరు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బడేమియ కబాబ్ ప్రాంతంలో హుస్సేన్ సాగర్ లో దూకేందుకు యత్నిస్తుండగా.. మరొకరు 1.45 నిమిషాలకు ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్లో దూకేందుకు యత్నించింది. జియాగూడకు చెందిన మరో యువతి ప్రేమలో పడి విఫలం కావడంతో ట్యాంక్ బండ్ పై గల పాత లవ్ హైదరాబాద్ ప్రాంతంలో హస్సేన్ సాగర్లోకి దూకేందుకు యత్నించింది. అలాగే మారేడుపల్లికి చెందిన ఓ మహిళ టీబీతో బాధపడుతుంది. దీనికి తోడు కరోనాతో ఆర్ధిక ఇబ్బందులు పెరిగిపోయాయి. దీంతో ఏమి చేయాలో తెలియగా హుస్సేన్ సాగర్ లో దూకేందుకు యత్నించింద . ఇలా వేరు వేరు ఘటనల్లో లేక్ పోలీసులు ఐదుగురిని కాపాడారు. అనంతరం కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు లేక్ ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి తెలిపారు.
- Tags
- hussen sagar