- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఐదుగురు ఉగ్రవాదుల అరెస్టు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని షాకర్‌పూర్‌లో సోమవారం ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరికి శౌర్య చక్ర బల్వీందర్ సింగ్ హత్యతో సంబంధం ఉన్నట్లు తేలింది. కొద్దిసేపు ఎదురు కాల్పులు అనంతరం ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్, ఖలీస్తాన్ ఉగ్రవాదులను ఏకం చేయడానికి పాకిస్తాన్ ఇంటర్‌సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ) పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు పేర్కొన్నారు.
అరెస్టయిన నిందితుల్లో ముగ్గురు జమ్ముకశ్మీర్, ఇద్దరు పంజాబ్‌కు చెందిన వారు ఉన్నారు. ముగ్గురు కశ్మీరీల నుంచి పంజాబ్‌కు చెందిన ఇద్దరు నేరస్తులు డబ్బు తీసుకోనున్నారనే పక్కా సమాచారం అందిందని డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ సింగ్ కుశ్వాహ తెలిపారు. లక్ష్మీనగర్ ప్రాంతంలో స్వల్ప ఎదురు కాల్పుల అనంతరం ఐదుగుర్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. కారు, రూ.లక్ష నగదు, 2 కిలోల హెరైన్, మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. లక్షిత వ్యక్తులను హత మార్చేందుకు పంజాబ్‌కు చెందిన ఇద్దరు క్రిమినల్స్‌కు ముగ్గురు కశ్మీరీలు డబ్బు ఇచ్చేందుకు ప్రయత్నించారని, డ్రగ్స్ విక్రయం ద్వారా నగదును సేకరించారని తెలిపారు.