- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు మృతి
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాష్ట్రంలోని చిక్కాబళ్లాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం జిలెటిన్ స్టిక్స్ పేలిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. చిక్కాబళ్లాపూర్ జిల్లాలో అక్రమంగా క్వారీల్లో వాడేందుకు తరలిస్తున్న జిలెటిన్ స్టిక్కులు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్వారీయింగ్ కోసం అక్రమంగా జిలెటిన్ స్టిక్కులను తీసుకెళ్లగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
Next Story