షార్ట్ ఫిల్మ్‌లో శృతి, కాజోల్

by Shyam |
షార్ట్ ఫిల్మ్‌లో శృతి, కాజోల్
X

తొలిసారి బాలీవుడ్ నటి కాజోల్, స్టార్ హీరోయిన్ శృతి‌హాసన్ ఓ షార్ట్ ఫిల్మ్‌లో కనిపించబోతున్నారు. వివిధ సామాజికవర్గాల నుంచి వచ్చిన 9 మంది అణగారిన మహిళలకు సంబంధించిన కథగా వస్తున్న షార్ట్ ఫిల్మ్ ‘దేవి’లో నటించారు. కేవలం రెండు రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలో నేహా ధూపియా, నీనా కులకర్ణి, ముక్తా బర్వే, సంధ్య మత్రే, రామా జోషి, శివానీ రఘువంశీ, యశస్విని దయామా ముఖ్యపాత్రల్లో నటించారు.

ప్రస్తుతం ఉన్న లింగవివక్ష, హింసను రూపుమాపేందుకు ‘దేవి’ లాంటి సినిమాలు రావడం అవసరముందన్నారు కాజోల్. ఇలాంటి చిత్రం ద్వారా ప్రజలకు ఒక మెస్సేజ్ ఇస్తున్నందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. దేవి సినిమా ఫస్ట్ లుక్‌ను షేర్ చేసిన కాజోల్ ఫిబ్రవరి 24న టీజర్ విడుదల కానున్నట్లు తెలిపారు. ప్రియాంక బెనర్జీ దర్శకత్వం వహించిన సినిమాను ర్యాన్ స్టీఫెన్, నిరంజన్ అయ్యంగార్ నిర్మించారు.

Advertisement

Next Story

Most Viewed