- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"ధరణి".. దిస్ సైట్ కెనాట్ బి రీచ్‌డ్
దిశ ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి మొండికేస్తోంది. ఓ వైపు సాంకేతిక సమస్యలు.. మరోవైపు రిజిస్ట్రేషన్లపై అస్పష్టత.. వెరసి ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలు బోసిపోయాయి. ధరణి పోర్టల్ ఉద్దేశం.. రైతులను మోసం చేయడమేనంటూ కొంతమంది ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసింది. ఇది ఏలా ఉన్నా.. వాస్తవంగా మాత్రం రైతులు భూముల క్రయవిక్రయాలు, పట్టాదారు పాసుపుస్తకాలకు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అధికారికంగా రిజిస్ట్రేషన్లు అయినా.. మ్యుటేషన్ల కోసం రైతులు తహసీల్దార్, వీఆర్ఓల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి తిరిగి విసిగివేసారిపోయేవారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ రైతుల భూక్రయవిక్రయాలన్నీ ధరణి పోర్టల్ ద్వారా జరిగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అందులో భాగంగానే సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి అసలు సమస్య మొదలయ్యింది. ఉన్నత చదువులు చదివిని వారికి సైతం ఇంటర్ నెట్, వెబ్‌సైట్లు, సర్వర్ల సతమతం ఒక పట్టాన అర్థం కావు. కానీ రైతులు తమ రిజిస్ట్రేషన్ల కోసం వీటన్నింటిపైనా తప్పక అవగాహన తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే రైతుల పట్ల పెద్ద సమస్యగా మారింది. కొన్ని మండలాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా స్లాట్ బుక్ చేసుకోలేదు. దీంతో ఆయా తహసీల్దార్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్లు లేక బోసిపోయాయి.
స్లాట్ బుకింగ్ తెలియక పడిగాపులు..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రైతులు తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్లాట్‌లో భూక్రయవిక్రయదారుల ఆధార్ నంబర్లు, పట్టాదారు పాసుపుస్తకం, కుటుంబ సభ్యులు, భూమి విస్తీర్ణం ఎంత?, సర్వే నంబరు వంటి వివరాలను నమోదు చేయాలి. దీంతో పాటు రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, పట్టాదారు పుస్తకం, మ్యుటేషన్ కోసం ఈ-చలాన్ ద్వారా ఫీజు చెల్లించాలి. అలా చేస్తే రిజిస్ట్రేషన్ సమయం కేటాయిస్తారు. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తిగా ఇంట ర్‌నెట్ సర్వర్ మీద ఆధారపడి ఉంది. ఇదంతా రైతులకు తెలియక.. తహసీల్దార్ కార్యాలయాల వద్ద భూముల రిజిస్ట్రేషన్లు చేస్తారంటూ చాలామంది వచ్చారు. అసలు విషయం తెలుసుకుని మీసేవ కేంద్రాల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. కొంతమంది ఎవరిని సంప్రదించాలో తెలియక తహసీల్దార్ కార్యాలయాల వద్దే పడిగాపులు కాశారు.
సతాయించిన సర్వర్లు..
ధరణి పోర్టల్ ప్రారంభం అయిన తొలిరోజు సాంకేతిక సమస్యలతో మొరాయించింది. ధరణి పోర్టల్‌కు వచ్చే ట్రాఫిక్ (వీక్షకులు)ను అధికారులు అంచనా వేయలేకపోవడమో.. లేక నిర్లక్ష్యమో గానీ సర్వర్ సమస్యతో ఇటు అధికారులు.. అటు రైతులు సతమతం అయ్యారు. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు రెండు మూడు గంటల పాటు నిరీక్షించాల్సిన అవసరం ఏర్పడింది. రిజిస్ట్రేషన్ అవ్వడం సంగతేమో గానీ కనీసం ధరణి సైట్ కూడా ఓపెన్ కాలేదు. ధరణి పోర్టల్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన వారికి ‘దిస్ సైట్ కెనాట్ బి రీచ్‌డ్’ అన్న సమధానం తప్ప మరొకటి లేదు. చివరకు స్లాట్ బుక్ చేసుకునేందుకు సైట్ ఓపెన్ కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విపరీతమైన వీక్షకులు ఉండే అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్ తదితర సైట్లకు ఏలాంటి సర్వర్ సమస్య ఉండదు. కానీ రూ.లక్షల కోట్ల విలువైన భూములు, రైతులకు సంబంధించిన సైట్ల విషయంలో ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఏంటని రైతులు వాపోతున్నారు. ధరణి వెబ్‌సైట్‌లో రై తుల భూముల వివరాల భద్రతపైనా కొంతమంది అ నుమానాలు వ్యక్తి చేస్తున్నారు.
మ్యుటేషన్ కోసం అదనపు పైకం..
ప్రస్తుతానికి తహసీల్దార్లు వ్యవసాయ భూములను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇందులో ప్రధా నంగా పార్టీషన్ డీడ్ (భూముల పంపకాలు), సక్సే షన్ డీడ్, గిఫ్ట్ డీడ్, సేల్ డీడ్ వంటి నాలుగు రకాల రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తున్నారు. ఇదిలావుంటే.. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకునే సమయంలో మ్యుటేషన్ కోసం అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. గతంలో అధికారికంగా మ్యుటేషన్ కోసం ఏ విధమైన ఛార్జీలు వసూలు చేయట్లేదు. దీనిపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండలో ఇదీ పరిస్థితి..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 15 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో నిత్యం 600 నుంచి 700 వరకు భూక్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రోజూ సగటున రూ.1.80 కోట్ల ఆదాయం సమకూరేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే.. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో మార్పు తీసుకొచ్చి.. ధరణి పో ర్టల్‌లోనే రైతుల రిజిస్ట్రేషన్ అయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఈ రిజిస్ట్రేషన్లు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాలోని ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి మొదలయ్యాయి.
కొడుక్కి పట్టా చేశా..
మాది సూర్యాపేట జిల్లా నాగారం మండలం బంగ్లా గ్రా మం. నాకున్న రెండెక రాలను నా కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చా. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే.. ముందు గాల్నే స్లాట్ బుక్ చేసుకోవాలంట. అదేందో అందరి రైతులకు తెలియడం కష్టం కదా. అధికారులు అవగాహన కల్పిస్తే బాగుండేది. దీనికితోడు సర్వ ర్లు సతాయించడంతో రిజిస్ట్రేషన్ ఆలస్యమయ్యింది.
-తొడుసు కొమురయ్య, నాగారం, సూర్యాపేట