Radhe Shyam: ‘రాధే శ్యామ్’ తొలి 30 నిమిషాలు.. ఊహించలేరు!

by Shyam |   ( Updated:2021-05-24 04:57:06.0  )
Radhe Shyam: ‘రాధే శ్యామ్’ తొలి 30 నిమిషాలు.. ఊహించలేరు!
X

దిశ, సినిమా : ప్రభాస్, పూజా హెగ్డే లీడ్ రోల్స్‌లో ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. అందమైన ప్రేమ కావ్యంగా రూపుదిద్దుకుంటున్న సినిమాలో హీరో హీరోయిన్ల రొమాంటిక్ లుక్ రిలీజైనప్పటి నుంచి ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. మూవీలోని మొదటి 30 నిమిషాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయని తెలుస్తోంది. యూరప్‌లో ఓ పెద్ద షిప్ సెట్‌లో చిత్రీకరించిన సీన్లు సినిమాకు మెయిన్ ఎస్సెట్‌గా మారనున్నాయని సమాచారం. లీడ్ యాక్టర్స్ మధ్య నడిచే ఈ మొత్తం ఎపిసోడ్‌లో గ్రాండ్‌ లుక్‌తో పాటు ఎమోషనల్ ఫీల్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియా ద్వారా తెలిసినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్‌ రిలీజ్‌ కోసం వెయిట్ చేయలేకపోతున్నారు. తమ అభిమాన హీరోను రొమాంటిక్ పాత్రల్లో చూసి చాలాకాలం కావడంతో రాధేశ్యామ్‌లో ప్రభాస్ రోల్ పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని జులై 30న హిందీతో పాటు సౌత్ లాంగ్వేజెస్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story