జీఎస్టీపై కొవిడ్-19 పన్ను ఉండకపోవచ్చు!

by Harish |
జీఎస్టీపై  కొవిడ్-19 పన్ను ఉండకపోవచ్చు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ఇప్పటికే అమ్మకాల క్షీణత, డిమాండ్ లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నందున వస్తువులు, సేవల పన్నుల(జీఎస్టీ)పై ఎలాంటి కొవిడ్-19 పన్ను ఉండదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. జీఎస్టీపై విపత్తు సెస్‌ను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఇటీవల కొన్ని వదంతులు వినిపించాయి. ఈ క్రమంలో కొవిడ్-19 సంక్షోభ సమయంలో, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో విపత్తు సెస్‌ను విధించడం అంటే మరో విపత్తు కంటే తక్కువేమీ కాదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పన్నులు విధిస్తే ప్రతికూల ప్రభావం పడుతుందని, తీవ్ర నష్టాలను చూడాల్సి ఉంటుందని, ఇప్పటికే అమ్మకాలు తక్కువున్నందున ఇలాంటి ఆలోచనల్లేవని సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పరిశ్రమల ఆదాయం క్షీణించడమే కాకుండా డిమాండ్, కార్మికుల కొరత వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో విపత్తు సెస్ వంటి చర్యలు వినియోగదారుల ఉత్సాహాన్ని తగ్గిస్తాయని, తద్వారా మార్కెట్‌ను బలహీనపరుస్తాయని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed