- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్జేడీ కూటమిలో ఎవరికెన్ని సీట్లంటే..!
దిశ, వెబ్‌డెస్క్ :
బీహర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అక్కడి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని మరీ రంగంలోకి దిగుతున్నాయి. గతంలో ఆర్జేడీ, జేడీయూ కలిసి పోటి చేయగా, ఈసారి అందుకు భిన్నంగా అధికార జేడీయూ బీజేపీతో పొత్తు పెట్టుకోగా, ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది.
ఇప్పటికే అధికార పార్టీ జేడీయూ, బీజేపీ మధ్య సీట్ల పంపిణీ ప్రక్రియ ముగింపు దశకు చేరుకోగా, రానున్న ఎన్నికల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై తాజాగా ఆర్జేడీ, కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చాయి. దీని ప్రకారం బీహర్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలకు గానూ 144 స్థానాల్లో ఆర్జేడీ, 70 స్థానాల్లో కాంగ్రెస్, 29 స్థానాల్లో లెప్ట్ పార్టీస్ పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
ఇదిలాఉండగా అక్టోబర్ 28వ తేదీన ఆ రాష్ట్ర ఎన్నికలు మూడు విడతలుగా ప్రారంభం కానున్నాయి. అయితే, ఈసారి కూడా బీహర్ పీఠం దక్కించుకోవాలని అధికార జేడీయూ నేత, సీఎం నితీష్ కుమార్ ఉవ్విల్లురుతుండగా.. ఎలాగైనా అధికార పార్టీ వైఫల్యాలను ప్రజా కోర్టులో ఎండగట్టి తమ కూటమి పీఠమెక్కాలని ఆర్జేజీ నేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ప్రణాళికలు రచిస్తున్నారు.