తుది దశకు జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ

by Shyam |
తుది దశకు జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ తుది దశకు చేరుకోగా సీఎం కేసీఆర్ సూచనలతో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఈనెల 13, 14న ఇంజినీర్ల సమావేశాన్ని నిర్వహించనున్నారు. మీడియం, మైనర్, మేజర్ ఇరిగేషన్ వ్యవస్థలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్న క్రమంలో దీనిలో భాగంగా 19మంది సీఈలకు బాధ్యతలను అప్పగిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేస్తారని భావించినా కొన్ని స్వల్ప మార్పులతో వాయిదా పడింది. ముందుగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల సీఈలను సమావేశానికి రావాలని ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం జల వనరుల శాఖ వ్యవస్థ, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పనులపై కూడా చర్చించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed