పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా ఎస్ఐ ఆత్మహత్య.. ఆ వేధింపులే కారణమా..?

by Anukaran |   ( Updated:2021-07-09 03:36:21.0  )
si suicide news
X

దిశ, వెబ్‌డెస్క్: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటుంటారు పెద్దలు. నిజమే.. పెళ్లి జరగాల్సిన సమయంలో పెళ్లి జరగకపోతే.. అందులోను అది అమ్మాయికైతే ఆ బాధ వర్ణానాతీతం. ఆమె ఎంత చదువుకున్నది అయినా, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా పెళ్లి జరగకపోతే తల్లిదండ్రులు, బంధువులు, చుట్టుపక్కల వారు చూసే చూపులు, సూటిపోటీ మాటలు తట్టుకోలేరు. కొంతమంది ఆ బాధను దిగమింగుకొని జీవితాన్ని కొనసాగిస్తారు.. మరికొంతమంది తనకెందుకు పెళ్లి కావడం లేదంటూ ఆలోచిస్తూ, పెళ్లి లేని జీవితం, ఈ సూటిపోటీ మాటలు పడలేక జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తారు. తాజాగా తనకు పెళ్లి కావడంలేదని ఓ మహిళా ఎస్సై దారుణ నిర్ణయాన్ని తీసుకుంది. బంధువుల సూటిపోటి మాటలు తట్టుకోలేక తనువు చాలిస్తున్నట్లు లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని రత్‌లామ్‌ జిల్లా కేంద్రంలో పోలీస్‌ స్టేషన్‌లో కవితా సోలంకి అనే మహిళ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. కమిట్ మెంట్ తో పని చేసే ఆమె పనితీరంటే అందరికి ఇష్టమే. అలా పనిలో నిమగ్నమైన కవితకు 35 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడం లేదు. తరచూ ఆమె పెళ్లి అంశం ఇంట్లో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. అటు తల్లిదండ్రులు కానీ ఇటు బంధువులు కానీ ఆమె ఇంకా పెళ్లి చేసుకోకపోవటాన్ని ఎత్తిచూపుతూ నిందిస్తూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం సెలవు పెట్టి ఇంటికి వెళ్లిన కవితకు అదే పెళ్లి అంశం ఎదురైంది.

పెళ్లి చేసుకోవా అంటూ తల్లిదండ్రుల పెడుతున్న పోరు పడలేకపోయింది. బుధవారం విధులలో చేరిన ఆమె అదే రాత్రి అధికార నివాసంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని స్నేహితురాలికి చెప్పడంతో ఆమె హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కవితను ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆలస్యమైపోయిందని, కవిత మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా కవిత రూమ్ ని చెక్ చేయగా సూసైడ్ నోట్ కనిపించింది. ” నాకు పెళ్లి కాలేదు.. నాకు ఎందుకు పెళ్లి కాలేదంటూ అదే పనిగా అడిగే వారికి సమాధానం చెప్పి.. చెప్పి అలిసిపోయాను. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాను” అంటూ తన ఆవేదనను తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన మధ్యప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తోంది.

Advertisement

Next Story