- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మా.. నేను ఏం పాపం చేశాను
దిశ వెబ్ డెస్క్ : తొందరలోనే లోకాన్ని చూస్తానంటూ మురిసి పోయిందేమో ఆ చిన్నారి. కానీ లోకాన్ని చూడకముందే అనంత లోకాలకు వెళ్లి పోయింది. అమ్మ గోరు ముద్దలకు నోచుకోక చెత్త కుప్పలో కుక్కలకు ఆహారంగా మిగిలి పోయింది. కంటికి పాపలా చూడాల్సిన కన్నతల్లి కసాయిలా మారి, ఆడ శిశువుని అనాథను చేసి చెత్త కుప్పలో పాడేసింది.
తన కడుపులో పెరుగుతుంది ఆడ శిశువని భారంగా భావించిందో ..లేక మరేదైన కారణం ఉందో కానీ ఓ తల్లి అబార్షన్ చేయించుకుని ఆడ శిశువుని చెత్తకుప్పలో పడేసిన ఘటన మైలార్ దేవుపల్లి పోలీస్లేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మధుబన్ శివారు జల్ పల్లి మార్గంలోని ఎర్రకుంట చెరువు ఒడ్డున చెత్తకుప్పలో పడి ఉన్న శిశువు మీద వీధి కుక్కలు దాడి చేశాయి. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శిశువుని పరిశీలించగా అప్పటికే ఆశిశువు మరణించడంతో ఉస్మానియా మార్చురీకి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.