- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తల్లి ఆ సమయంలో ఇంట్లో లేదని కూతురుపై తండ్రి అత్యాచారం
దిశ, వెబ్‌డెస్క్ : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి అత్యంత నీచానికి పాల్పడ్డాడు. భర్త లేని మహిళతో సహజీవనం చేస్తూ ఇద్దరికి తండ్రి అయిన దుర్మార్గుడు, ఆమె మొదటి భర్త కూతురుపై కన్నేసి కాటేశాడు. తండ్రి స్థానంలో ఉండి ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పెద్దకాకానిలోని ఎన్‌టీఆర్ కాలనీకి చెంది మహిళ భర్తతో వచ్చిన విభేదాలతో అతడితో విడిపోయింది. అప్పటి నుంచి తన కూతురుతో కలిసి జీవిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ కుమార్తెను చదివిస్తోంది. ప్రస్తుతం బాలిక 6వ తరగతి చదువుతోంది. అయితే ఒంటరిగా ఉన్న మహిళతో పరిచయం పెంచుకున్న రాయపూడి జోజిబాబు ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అతడికి అప్పటికే పెళ్లై భార్య, పిల్లలు ఉన్నా వారిని వదిలేసి పదేళ్లుగా సదరు మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో వారికి ఇద్దరు పిల్లలు జన్మించారు.
అయితే జోజిబాబు మహిళతో సహజీవనం కొనసాగిస్తూనే ఆమె మొదటి భర్త సంతానమైన బాలిక (కూతురు)పై కన్నేశాడు. ఆదివారం రాత్రి ఇంట్లో తల్లి లేకపోవడంతో బాలికకు మాయమాటలు చెప్పి ఇంటి సమీపంలోని మైదానంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి తిరిగివచ్చిన బాలిక పెంపుడు తండ్రి చేసిన దారుణాన్ని తల్లికి చెప్పింది. షాక్‌కు గురైన తల్లి వెంటనే పెద్దకాకాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో సహజీవనం చేస్తూనే కూతురుపై అత్యాచారం చేశాడని, నాన్న.. అని పిలిస్తే నరకం చూపించాడని విలపించింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్యపరీక్షల కోసం జీజీహెచ్‌కు తరలించారు.