కుమార్తె ప్రేమ వివాహం.. సూసైడ్ చేసుకున్న తండ్రి

by Sumithra |
Father suicide
X

దిశ, నల్లగొండ: కుమార్తె ప్రేమ వివాహం చేసుకున్నదని తీవ్ర మనస్థాపం చెందిన ఓ తండ్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పాజిపేట గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోలె వెంకన్న వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతడి కుమార్తె ప్రతిభారాణి అదే గ్రామానికి చెందిన వంగూరి ఏడుకొండలు అనే యువకుడిని ప్రేమించింది. ఈ నెల 20న ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి, ఏడుకొండలును ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో తీవ్రమైన మనస్తాపానికి గురైన వెంకన్న ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక రైతులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి పోలీసులు వెళ్లి వివరాలు సేకరించి, మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వెంకన్న భార్య శ్రీలత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

Advertisement
Next Story