- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆవును కాపాడబోయి.. తండ్రి, కొడుకు మృతి
దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.చెరువులో మునిగి తండ్రి,కొడుకు మృతి చెందారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుల్యాల ఓదెలు, అతని కుమారుడు మధుకర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆవును మేపేందుకు చేనుకు తీసుకెళ్తుండగా…
ప్రమాదవశాత్తు ఆవు చెరువులో పడిపోయింది. దానిని కాపాడేందుకు మధుకర్ చెరువులో దిగాడు. నీటిమట్టం ఎక్కువగా ఉండటం వల్ల మధుకర్ ఊపిరాడక నీటిలో మునుగుతుండటం చూసిన తండ్రీ.. కొడుకును కాపాడే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రమాదవశాత్తు కొడుకుతో పాటు తండ్రి కూడా నీటిలో మునిగి అక్కడికక్కడే చనిపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదన అందరినీ కంటనీరు తెప్పిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.