ఫారుక్ అబ్దుల్లాపై గృహ నిర్భందం ఎత్తివేత

by Shamantha N |   ( Updated:2020-03-13 05:16:15.0  )
ఫారుక్ అబ్దుల్లాపై గృహ నిర్భందం ఎత్తివేత
X

జమ్మూకాశ్మీర్‌కు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేత, ప్రస్తుత లోక్‌సభ ఎంపీ ఫారుక్ అబ్దుల్లా ఎట్టకేలకు గృహ నిర్భందం నుంచి విముక్తుడయ్యాడు. గతేడాది ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35ఏ తొలగింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చెలరేగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ముగ్గురు మాజీ సీఎంలు, జమ్మూ వేర్పాటు వాదులను కేంద్ర ప్రభుత్వం నిర్భందించింది. ఇందులో 15 ఆగస్టు2019న పీఎస్ఏ (పబ్లిక్ సేఫ్టీ యాక్ట్) కింద నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారుక్ అబ్దుల్లాను ఆయన గృహంలోనే బంధిగా ఉంచారు.ఆయనతో పాటు ఆ రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరు మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ పార్టీ నేత మహబూబా ముఫ్తీని కూడా నిర్భందించారు. పీఎస్ఏ యాక్ట్ 1978 కింద మొదట 3నెలలు గృహనిర్భందంలో గడిపిన ఫారుక్‌కు, 2019డిసెంబర్ 13న మరో 3నెలలు నిర్భంధాన్ని పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతో 83ఏళ్ల ఫారుక్ 7నెలలు తన ఇంట్లోనే బంధిగా గడిపారు. తనకు విధించిన నిర్భందం 11-03-2020తో ముగియడంతో శుక్రవారం అతన్నికేంద్ర సర్కార్ విడుదల చేసింది. అయితే మిగతా నేతలను కూడా విడుదల చేయాలని విపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
tags; jammu and kashmeer, farooq abdulla, omar and mamabooba mufthi, jammu seperation leaders detention

Advertisement

Next Story

Most Viewed