- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహాత్ముడి బాటలో రైతులు తప్పక విజయం సాధిస్తారు: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ రైతుల పక్షపాతి అని, ఆయన చూపిన బాటలో పోరాడుతున్న రైతులు తప్పక విజయం సాధిస్తారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారికి నివాళి అర్పించారు. లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్’ అనే నినాదాన్నిచ్చిన్నట్టు గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా కొత్త అగ్రిచట్టాలపై నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో మహాత్ముడి జయంతి సందర్భంగా ఆ చట్టాలను ప్రస్తావించారు. ఆ మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతూనే ఉన్నదని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తమ కార్యకర్తలు రైతులపక్షాన పోరాడుతున్నారని వివరించారు. అన్నదాతలకు ప్రధాని తీరని అన్యాయం చేశారని, కనీసం ఒక్కసారైనా రైతులను సంప్రదించలేదని విమర్శించారు. వారి బాధలు వినాల్సింది పోయి రైతులు, వ్యవసాయ కూలీలపై అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక ప్రభుత్వం లాఠీ చార్జీ చేసిందని అన్నారు.