30న దేశవ్యాప్త ర్యాలీలు: కిసాన్ యూనియన్

by Shamantha N |
30న దేశవ్యాప్త ర్యాలీలు: కిసాన్ యూనియన్
X

న్యూఢిల్లీ: ఈ నెల 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పబ్లిక్ ర్యాలీలు తీయడానికి నిర్ణయించినట్టు భారతీయ కిసాన్ యూనియన్(ఆర్) బల్బీర్ ఎస్ రాజేవాల్ తెలిపారు. ఒకరోజు నిరాహార దీక్షకు కూడా కూర్చుంటామని వెల్లడించారు. ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో బడ్జెట్ డే సందర్భంగా ఫిబ్రవరి 1న పార్లమెంటుకు తలపెట్టిన మార్చ్‌ను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ట్రాక్టర్ ర్యాలీని విఫలం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేసిందని, కానీ, 99.99శాతం మంది రైతులు శాంతియుతంగానే ర్యాలీ తీశారని వివరించారు.

Advertisement

Next Story