ఉత్పత్తులలోనూ రైతులకు లాభాలు దక్కాలి.. జాతీయ అగ్రికల్చర్​ సెమినార్​లో నిపుణులు వెల్లడి

by Shyam |
ఉత్పత్తులలోనూ రైతులకు లాభాలు దక్కాలి.. జాతీయ అగ్రికల్చర్​ సెమినార్​లో నిపుణులు వెల్లడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పంట ఉత్పత్తితో పాటు తద్వారా వచ్చే ఉత్పాదకాల్లోనూ రైతులకు లాభాలు దక్కాలని అగ్రికల్చర్​ నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శనివారం జూబ్లీహిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో ” రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ ఫర్ పరడిజం షిఫ్ట్ టువార్డ్స్ స్ట్రక్చరల్ చెంజెస్ ఫర్ సస్తేనేబుల్ అగ్రికల్చరల్ వ్యాలు చైన్ – ఆపర్చునిటీస్ అహీడ్ ” అనే అంశంపై జరిగిన జాతీయ సెమినార్ లో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ… రైతులు పండించిన పంటలను మార్కెట్​ లో విక్రయించిన తర్వాత కూడా ఆ పంటల ద్వారా తయారు చేసే వస్తు, ద్రవ రూప ఉత్పత్తులపై లాభాలు దక్కాల్సిన అవసరం ఉన్నదన్నారు. రైతులకు ఆర్థికంగా మేలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదన్నారు. అందుకు అనుసరించాల్సిన విధానాలకు ప్రత్యేక రూపకల్పన అవసరమన్నారు.

అమూల్ పాలు విక్రయించిన తర్వాత తద్వారా తయారు చేసే స్వీట్లు, పెరుగు, ఇతర పానీయాల విక్రయాల్లో కూడా రైతులకు షేర్ దక్కుతోందని, ఇదే తరహా పద్దతి అన్ని వ్యవసాయ ఉత్పత్తులలో అమలు కావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ఇలాంటి పరిస్థితులు ఆచరణలోకి వస్తే రైతులకు ఆర్థిక భరోసా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఆచరణలోకి వచ్చేలా దేశ వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు స్పష్టం చేశారు.దీంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు వచ్చేందుకు రైతు ఉత్పాదక సంస్థలను ( F.P.O ) ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలన్నారు.

రైతులు సమిష్టిగా ఉంటేనే గిట్టుబాటు ధరలు పొందవచ్చని, తద్వారా పంటల సాగు విషయంలో కూడా కొత్త దనాన్ని ఆవిష్కరణ చేయొచ్చన్నారు. ఈ సెమినార్ లో కేంద్ర మాజీ మంత్రి సోంపాల్ శాస్త్రీ, వ్యవసాయ రంగ నిపుణులు అమితాబ్ కుండు, రవీంద్ర ధారియా, రాజ్ వీర్ శర్మ, కే కే త్రిపాఠి, జీ అగర్వాల్, వినీత హరిహరన్, ఖుషీ రాధ్య, మోహన్ కందా, బినోద్ ఆనంద్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సీజీజీ డీజీ రాజేంద్ర నింజే, డైరెక్టర్ జువ్వాడి దేవీప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

రైతుల కోసం వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాం.. బోయినపల్లి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని, ఇది హర్షించదగిన పరిణామం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ర్ట ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని అన్నారు. ముఖ్యంగా నీటి పారుదల, వ్యవసాయ, విద్యుత్ రంగాల్లో చేపట్టిన విప్లవాత్మక చర్యల వల్ల ఆయా రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించామన్నారు. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ అర్త్ నీతి నివేదికలో స్పష్టంగా పేర్కొందని వినోద్ కుమార్ గుర్తుచేశారు.

గ్రోత్​ రేట్​ 16.5 శాతానికి పెరిగింది..

వ్యవసాయ, దాని అనుబంధ సంస్థలలో తెలంగాణ ఆవిర్భావం ముందు రెండు శాతం ఉన్న గ్రోత్ రేట్​ ప్రస్తుతం 16.5% శాతానికి చేరుకుందని అన్నారు. వ్యవసాయం, ఫిషరీస్, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీలో రూ. 76, 123 కోట్ల నుంచి ప్రస్తుతం రూ. 1, 84, 321 కోట్లకు చేరుకున్నామన్నారు. వరి స్థూల విలువ రూ.9,528 కోట్ల నుంచి రూ. 47, 440 కోట్లకు చేరిందని, కందుల విలువ రూ. 530 కోట్ల నుంచి రూ. 3,808 కోట్లకు చేరిందన్నారు. దీంతో తలసరి ఆదాయం రూ. 1,24,104 నుంచి ఏకంగా రూ. 2,37,632 కు పెరిగిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed