- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం…
దిశ, సిరిసిల్ల : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యవసాయానికి దేశంలో ఏ నాయకుడు ఇవ్వని ప్రాధాన్యత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారని పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాలో బుధవారం జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. మొదటగా పట్టణంలోని అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన కేటీఆర్ ఆ తర్వాత కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల అర్బన్ పరిధిలోని సర్ధాపూర్ లో నూతనంగా నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డును మంత్రి క్షేత్ర స్థాయిలో సందర్శించి, పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ఒకప్పుడు కరువు, మెట్ట ప్రాంతంగా ముద్రపడి ఉన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు అంచనాలకు మించి ధాన్యం దిగుబడి అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యవసాయంపై పట్టు, రైతాంగ సమస్యలు తెలిసిన వ్యక్తి కావడంతో వ్యవసాయ, సాగునీటి రంగంలో సమూల మార్పులకుశ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కర్షక ప్రభుత్వంగా అవతరించిందని స్పష్టం చేశారు. జిల్లాలో వ్యవసాయ విస్తీర్ణం, దిగుబడి పెరిగిందన్నారు. ఒకప్పటి మెట్ట ప్రాంతంలో ఇప్పుడు ధాన్యం దిగుబడి అంచనాల కంటే ఎక్కువగా ఉండడం గొప్ప విషయమని మంత్రి పేర్కొన్నారు.సర్దాపూర్ లో వ్యవసాయ మార్కెట్ యార్డును భారీ సామర్థ్యంతో సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగిందని మంత్రి తెలిపారు.
జూన్ 11 వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతులమీదుగా ఈ వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభించనున్నట్లు తెలిపారు.జిల్లాలోని భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు రెవెన్యూ అధికారులు చర్యలు చేపడతారని, రైతులు వారి వారి సమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే రైతులు ఎవరూ నష్టపోకుండా అటవీ, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పని చేస్తూ గతంలో రైతు బంధును పొందిన వారందరికీ, వారితో పాటు కొత్తగా అర్హులైన వారికి కూడా రైతుబంధు సాయం అందించాలని మంత్రి ఆదేశించారు.