- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రైతు సంక్షేమం టీఆర్ఎస్‌తోనే సాధ్యం’
దిశ, మల్హర్: తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కుంభం రాఘవ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం మండల కేంద్రమైన తాడిచర్లలో నిరసన, ర్యాలీ నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ.. కెసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం వినూత్న పథకాలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం, రైతుల పరంగా ద్రోహిగా మారిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనకుండా నాటకాలాడుతూ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 రైతు నల్ల చట్టాలు ఉద్యమంతోనే రద్దయ్యాయని అన్నారు. ధాన్యం కొంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు రావుల కల్పన మురళి, మండల కో ఆప్షన్ మెంబర్ సభ్యుడు అయూబ్ ఖాన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కోట రవి, దేవర్నెని రాజేశ్వరరావు, మల్కా ప్రకాష్ రావు, బొంతల రాజు, బూడిద మల్లేష్, కాసాని శ్రీశైలం తో పాటు పలువురు పాల్గొన్నారు.