- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్ డెస్క్: మనదేశంలో ఆవును దైవంగా చూస్తారు. రైతులకు..ఆవు ఎంతో ఆరాధ్యమైనదే కాదు. తమ ఇంటిల్లిపాదికి ఆహారం అందించే కల్పతరువు కూడా. అందుకే వాటిని తమ కుటుంబంలో ఒకరుగా..తమతో సమానంగా చూస్తారు. పండుగ రోజుల్లో వాటిని ఆరాధిస్తారు. భూమి దున్నడానికి, బండి తోలడానికి ఇలా వ్యవసాయ పనుల్లో వీటి ఉపయోగం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి అంతలా అభిమానించే ఆవులకు కష్టం వస్తే.. ఆ రైతు హృదయం విలవిల్లాడిపోతుంది. చిన్న అనారోగ్యం చేసినా.. బాధ పడిపోతారు. తాజాగా ఓ రైతు..తన ఆవుకు గాయపడగా.. తల్లడిల్లిపోయాడు. తన ఆవుకు కష్టం కలగకుండా ఉండేందుకు ఏకంగా హెలికాప్డర్ ద్వారా దాన్ని తరలించి చికిత్స అందించాడు.
స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో ‘కౌవ్ పరేడ్’ ఎంతో అట్టహాసంగా జరుగుతుంది. మూడున్నర లక్షల ఆవులు అందులో పాల్గొంటాయి. ఇది ఏటా జరుగుతుంది. ఇటీవల ఆల్ఫ్స్ పర్వతాల్లో నిర్వహించిన బోడెన్‌ఫహార్డ్ ఈవెంట్‌కు తరలించిన ఆవు గాయపడింది. అది కుంటుతూ నడవడాన్ని రైతు గమనించాడు. కాలుకు గాయం కావడంతో..అలా నడిస్తే..ఆవుకు మరింత ఇబ్బంది కలుగుతుందని, బాధ ఎక్కువవుతుందని ఆ రైతు భావించాడు. దీంతో వెంటనే హెలికాప్టర్ కావాలని సాయం కోరాడు. రెస్క్యూ టీమ్ వచ్చి ఆవుకి తాళ్లు కట్టి హెలికాప్టర్ ద్వారా పైకి లేపి పర్వతాల్లోంచి కిందకు తీసుకొచ్చారు. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ రైతుకు తన ఆవుపై ఉన్న ప్రేమ అందరి ప్రశంసలు అందుకుంటుంది.