- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్మశానం కట్టొద్దని రైతు సూసైడ్ అటెంప్ట్
by Sumithra |
X
దిశ, నర్సంపేట : తన వ్యవసాయ భూమి పక్కన శ్మశానవాటిక నిర్మించొద్దంటూ ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన నల్ల నర్సింహారెడ్డి అనే రైతుకి ఎస్సారెస్పీ డీబీఎం 38వ కాలువ పక్కన వ్యవసాయ భూమి ఉన్నది. ఈ భూమి పక్కన శ్మశాన వాటిక నిర్మించాలని అధికారులు, గ్రామ పాలకవర్గం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ స్థలంలో స్మశాన వాటిక నిర్మాణం విషయమై పరిశీలిస్తుండగా మనస్థాపం చెందిన నర్సింహారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబీకులు, గ్రామస్తులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Advertisement
Next Story