- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రజల గుండెల్లో నిలిచిపోవాలనేదే నా కోరిక : జానారెడ్డి
దిశ, హాలియా: ఇచ్చిన హామీలు అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. గురువారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో రైతులతో ముకాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జానారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతందని ఇందుకు నిదర్శనమే మంథనిలో లాయర్ల హత్యలని అన్నారు. మంథని ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హత్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అబద్దాలతో రాష్ట్రంలో పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. తమకు పదవులపై మోజు లేదని అన్నారు. రాబోయే జీవితకాలంలో మిగిలిన పనులను పూర్తి చేసి మీగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనేదే తన ఆశని తెలిపారు. ఉప ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.
అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని అన్నారు. గత కాంగ్రెస్ పార్టీ పాలనలో సబ్సిడీపై రైతులకు కోసం చట్టం చేసిన విషయాన్ని వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరాది రైతులు చలిని సైతం లెక్క చేయకుండా గత 75 రోజులుగా దీక్షలు చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వానికి చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కేంద్రంతో చీకటి ఒప్పదాలు చేసుకుని రైతులను బజారున పడేశారని ఆరోపించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలుపు ద్వారా అన్నీ సాధించవచ్చని తెలిపారు.