ముగిసిన ఫర్హాన్ ‘తుఫాన్’.. ‘మిసెస్ మార్వెల్’ షురూ?

by Shyam |
Farhan Akhtar
X

దిశ, సినిమా: బాలీవుడ్ మల్టీ‌టాలెంటెడ్ హీరో ఫర్హాన్ అక్తర్ లేటెస్ట్ ఫిల్మ్ ‘తుఫాన్’ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. కాగా ఫర్హాన్ తన నెక్ట్స్ మూవీ కోసం మార్వెల్ స్టూడియోతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ‘ఐరన్ మ్యాన్, హల్క్, కెప్టెన్ అమెరికా’ వంటి ప్రెస్టీజియస్ అండ్ బిగ్గెస్ట్ సూపర్ హీరోస్‌ ప్రాంచైజ్ అవెంజర్ సిరీస్ నిర్మించిన ‘మార్వెల్ స్టూడియోస్’ ఫర్హాన్‌తో ఎలాంటి సినిమా తీయబోతుందనే చర్చ బీటౌన్‌లో జరుగుతుంది. ఇక ఈ చిత్రానికి ఏం టైటిల్ పెట్టనున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతుండగా, తాజాగా ‘మిసెస్ మార్వెల్’ అనే టైటిల్ ఖరారైందని.. బ్యాంకాక్, థాయిలాండ్‌లో షూటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఫర్హాన్ కానీ, మార్వెల్ స్టూడియో వారు గానీ స్పందించలేదు.

ఇక ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత డైరెక్టర్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా, ఫర్హాన్ కాంబినేషన్‌లో వస్తున్న ‘తుఫాన్’ వచ్చే నెల 12న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ నటించింది. కాగా డైరెక్టర్ రాకేశ్ – ఫర్హాన్‌ది సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో ‘తుఫాన్’ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

Advertisement

Next Story