‘భూభారతి’పై CM రేవంత్ మరోసారి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2025-04-13 10:18:21.0  )
‘భూభారతి’పై CM రేవంత్ మరోసారి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భూభారతి(Bhu Bharathi) అమలుపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి పోర్టల్‌ను రేపు జాతికి అంకితం చేయబోతున్నట్లు తెలిపారు. సామాన్య రైతుకు కూడా అర్ధమయ్యేలా భూభారతిని రూపొందించాలని అధికారులకు సూచించారు. భూభారతి తాత్కాలికం కాదని.. కనీసం వంద సంవత్సరాల పాటు ఉంటుందని అన్నారు. భూభారతి వెబ్‌సైట్ సైతం అత్యాధునికంగా ఉండాలని తెలిపారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. భూభారతి నిర్వహణ విశ్వసనీయత సంస్థకు అప్పగించాలని చెప్పారు.

ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీసీఎల్‌ఏ ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్, సీఎం ఓఎస్‌డీ, రెవెన్యూశాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా భూభారతి పోర్టల్‌(Bhu Bharathi Portal)ను రూపకల్పన చేసినట్లు నిన్నటి సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. భూభారతి పోర్టల్‌పై ప్రతి మండలంలో అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్‌ స్థానంలో తీసుకురానున్న భూభారతిని ఈ నెల 14 నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పైలెట్‌ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఈ పోర్టల్‌ను అందుబాటలోకి తీసుకురానుంది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు సీఎం తెలిపారు.

Next Story