మిల్కాజీ.. మీరు లేరంటే నమ్మలేకపోతున్నా : ఫర్హాన్ అక్తర్

by Shyam |
Farhan Akhtar And Milkha Singh
X

దిశ, సినిమా : భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్ మరణం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కరోనాతో దాదాపు నెలరోజులు పోరాడిన ఆయన శుక్రవారం మరణించడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియావ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా తన బయోపిక్‌ ‘భాగ్ మిల్కా భాగ్’లో నటించిన బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ హార్ట్ ఫెల్ట్ నోట్‌తో లెజండరీ అథ్లెట్‌పై తన గౌరవాన్ని చాటుకున్నారు. మిల్కా సింగ్.. తన కృషి, నిజాయితీ, దృఢ సంకల్పంతో ప్రతీ ఒక్కరిని ఏ విధంగా ఇన్‌స్పైర్ చేసాడో గుర్తుచేసుకున్నాడు.

ఈ మేరకు ట్విట్టర్‌లో తన ఫొటో షేర్ చేసిన ఫర్హాన్.. ‘డియర్ మిల్కాజీ, నా జీవితంలో భాగమైనమీరు లేరన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నేను మీ నుంచి నేర్చుకున్న మొండి పట్టుదలను ఎప్పటికీ వదులుకోను. ఆయన హృదయపూర్వక, ప్రేమగల, నిరాండబరమైన వ్యక్తిత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది. మిమ్మల్ని ఎప్పటికీ హ‌ృదయపూర్వకంగా ప్రేమిస్తుంటా’ అని తెలిపారు.

ఆలోచనకు, ఆశయానికి మిల్కాసింగ్ ప్రతినిధి అని.. శ్రమ, నిజాయితీ, దృఢ నిశ్చయంతో ఒక వ్యక్తి శిఖర స్థాయికి చేరుకోవచ్చు అనేందుకు ఆయన జీవితమే ఉదాహరణ అని పేర్కొన్నారు. మిల్కా సింగ్ అందరి జీవితాలను ప్రభావితం చేశారని.. తండ్రిగా, స్నేహితుడిగా తన గురించి తెలిసిన వారికి అది ఆశీర్వాదమే అని అభిప్రాయపడ్డారు. కాగా మిల్కాసింగ్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీతో పాటు షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా వంటి బాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పించారు.

https://twitter.com/FarOutAkhtar/status/1406070061241040900?s=20

Advertisement

Next Story

Most Viewed