- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మెదక్ ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం.. పీఎస్‌లో ఫిర్యాదు
by Shyam |

X
దిశ ప్రతినిధి, మెదక్: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కరోనా సోకిందంటూ ఫేస్ బుక్ లో తప్పుడు ప్రచారం చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని మెదక్ పట్టణానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యేపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని.. ప్రచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వారు అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదు చేసినవారిలో గంగాధర్, లింగారెడ్డి, జీవన్ రావు, కిషోర్ తదితరులు ఉన్నారు.
Next Story