ఎల్బీనగర్‌లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు.. ముగ్గురు అరెస్ట్

by Sumithra |
Excise Officers
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: ఎల్బీన‌గ‌ర్ కామినేని ఆసుపత్రి చౌర‌స్తాలో ఎక్సైజ్ పోలీసులు బుధవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 87 కిలోల 80 గ్రాముల వీడ్ ఆయిల్‌, రెండు కిలోల గంజాయి, రెండు ద్విచ‌క్ర వాహ‌నాలు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స‌రూర్‌న‌గ‌ర్ ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీ‌నివాసరావు ప‌ర్యవేక్షణ‌లో ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. ఈ దాడుల్లో మొత్తం రూ.2 ల‌క్షల 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎవ‌రైనా నిషేధిత పదార్థాలైనటువంటి గంజాయి, డ్రగ్స్‌ను అమ్మకాలకు పాల్పడినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన శిక్షలు తప్పవని డీపీఈవో ర‌వీంద‌ర్‌రావు హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ అధికారులు జే.శ్రీ‌నివాస‌రావు, స్టీవెన్స్, వెంక‌న్న, ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్ శ్రీ‌నివాస‌రావు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed