తెలంగాణ ఉద్యమ నేత.. మాజీ ఎంపీ ఇకలేరు

by Shyam |
తెలంగాణ ఉద్యమ నేత.. మాజీ ఎంపీ ఇకలేరు
X

దిశ, రంగారెడ్డి: దళిత ఉద్యమ నేత, 1969 తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎంపీ వీ తులసీరామ్ గురువారం ఉదయం గగన్‌పహాడ్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. 1938 అక్టోబర్ 3న రాజేంద్రనగర్‌లో ఆయన జన్మించారు. మర్రి చెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణ ప్రజా సమితి తరఫున 1969లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయగా, రెండోసారి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పెద్దపల్లి లోక్‌సభ నుంచి ఎంపీగా తులసీరామ్ గెలుపొందారు. 1982లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 1984లో టీడీపీ తరఫున నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. తులసీరామ్ ఆకస్మిక మృతి విషయం తెలుసుకున్న శాసనమండలి మాజీ ఛైర్మన్ కనకమామిడి స్వామిగౌడ్, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు బొక్క వేణుగోపాల్‌ తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు.

Tags: Ex MP, Tulasi ram, death,Tribute

Advertisement

Next Story