చేనేతల సమస్యలు పరి‌ష్కరించాలి

by Shyam |
చేనేతల సమస్యలు పరి‌ష్కరించాలి
X

దిశ, మునుగోడు: కరోనా కారణంగా చేనేత కార్మికులు పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా చండూర్‌లో చేనేత కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాపోలు చేనేతలకు మద్దుతు తెలుపుతూ.. ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే చేనేతల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి కరోనా భృతి కింద నెలకు రూ.8000 చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. రైతులకు అందజేస్తున్న బీమాను చేనేత కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన చేనేత కార్మిక కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ వివర్స్ అధ్యక్షుడు జూలూరు ఆంజనేయులు, కార్మిక సంఘం అధ్యక్షుడు తిరందాసు శ్రీను, చండూరు మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాపోలు నారాయణ, ఉపాధ్యక్షుడు కోమటి వీరేశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed