- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కృష్ణా బేసిన్ నుంచి నీటిని తరలనివ్వం
దిశ, మహబూబ్ నగర్ : పెన్నా బేసిన్‌లో ఉన్న రాయలసీమకు కృష్ణా బేసిన్ నుంచి నీటిని తరలిస్తే ఊరుకునేది లేదని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు.నాడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి 44వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తుంటే అప్పట్లో టీఆర్‌ఎస్ పక్షాన పోరాడింది తామే అని గుర్తు చేశారు. నీళ్లు నిధులు నియామకాల్లో తెలంగాణాకు అన్యాయం జరుగుతుందనే ఆ రోజు ఉద్యమానికి నడుం బిగించానని చెప్పారు. పోతిరెడ్డిపాడు నుంచి అంత పెద్ద ఎత్తున నీటిని దోచేకెళ్తుంటే పాలమూరుకు అన్యాయం జరుగుతుందనే ఉద్యమించామన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిందని, కేంద్ర జలవనరుల శాఖ కూడా కృష్ణావాటర్ బోర్డుకు పోతిరెడ్డి పాడు పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారని వివరించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే ముందు పాలమూరు, ఆ తర్వాత హైద్రాబాద్‌కు మంచినీరు, అనంతరం నాగార్జున సాగర్‌కు నీళ్లు రాక తీవ్ర ఇక్కట్లు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ విషయంపై కేంద్రం సూటిగా తన వైఖరి చెప్పిన నేపథ్యంలో..ముందు పాలమూరు ప్రాజెక్టు గురించి ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవచూపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆనాడు ఉద్యమంలో పాల్గొని ప్రజలకు నీళ్లిస్తామని చెప్పిన మంత్రులు ప్రాజెక్టులు పూర్తిచేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జీఓ.69 ద్వారా వచ్చిన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డి పాడు ద్వారా గతంలో 44 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తే దానికి వ్యతిరేకంగా పోరాడింది మేమే, భవిష్యత్తులో కూడా ఉద్యమించేదీ తామే అని జితేందర్ రెడ్డి తెలిపారు.