- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అంతర్వేదిపై రాజకీయం ఎందుకంటే….

దిశ వెబ్ డెస్క్:
అంతర్వేది రథం దగ్దం ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన రెబల్ ఎమ్మెల్యే నియోజక వర్గంలో అంతర్వేది ఆలయం ఉందన్నారు. అందువల్లే ఈ ఘటనపై జనసేన, బీజేపీ లు రాజకీయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కులాభిమానంతో జనసేన, మతాభిమానంతో బీజేపీ పార్టీలు కుళ్లి పోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ నేత సోము వీర్రాజుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సోము వీర్రాజుకు కులాభిమానం ఎక్కువని ఆయన విమర్శించారు. కేంద్రమాజీ మంత్రి చిరంజీవిని సీఎం చేయడమే వీర్రాజు లక్ష్యమని ఆయన అన్నారు. చిరంజీవి కుటుంబానికి సోము వీర్రాజు హనుమంతునిలా మారాడని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్కో కులానికి,మతానికి ఒక్కోలా నిర్ణయాలు సీఎం జగన్ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దళితులపై సీఎం జగన్ కు చిత్తశుద్ది ఉంటే శిరో ముండనం ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.