హుజురాబాద్ ఎన్నికల్లో కేసీఆర్‌ పోటీ చేయాలి.. మాజీ ఎమ్మెల్యే సవాల్

by Ramesh Goud |   ( Updated:2021-08-12 03:31:45.0  )
హుజురాబాద్ ఎన్నికల్లో కేసీఆర్‌ పోటీ చేయాలి.. మాజీ ఎమ్మెల్యే సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే హుజురాబాద్ ఉపఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సవాల్ విసిరారు. రెండు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్‌‌లో ఓటమి భయంతో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రూ.200 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వివిధ పార్టీల నుంచి నాయకులను చేర్చుకుని ఈటలను ఓడించాలని కుతంత్రాలు పన్నుతున్నారని ఆరోపించారు. మంత్రి హరీష్ రావు చెప్పినట్టుగా.. 119 నియోజకవర్గాల్లో కేవలం 4 నియోజకవర్గాల్లో మాత్రమే ఇండ్లు కట్టారని మిగతా ప్రజలను పట్టించుకోలేదని ఆరోపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈటలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి.. అవమానాలకు గురి చేశారన్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు పాలకులు అయ్యారని మండిపడ్డారు. దళితులకు ఇస్తామన్న 3 ఎకరాల భూమి ఇవ్వలేదు కానీ.. కొత్తగా మరో పథకం ప్రారంభించి దళితులను మోసం చేస్తున్నారని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed