అంటువ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి : నిర్మల్ కలెక్టర్

by Aamani |
అంటువ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి : నిర్మల్ కలెక్టర్
X

దిశ, ఆదిలాబాద్: వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో.. అంటువ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ.. ప్రజలకు సూచించారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాలపాటు ఇంటి ఆవరణలోని నీటి నిల్వలను తొలగించాని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన సూచనలను జిల్లా కలెక్టర్ పాటించారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో ఈ రోజు ఉదయం ఆయన పూల కుండీలలో నిల్వ నీటిని తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ మాట్లాడుతూ.. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమలు వ్యాప్తి చెందకుండా లార్వా దశలోనే వాటిని అరికట్టాలని, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోని కూలర్లు, డ్రమ్ములు, పాత్రల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి శుభ్రం చేయాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed