- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొంగొత్తగా రంగారెడ్డి కాబోతుందా..?
అభివృద్ధి దిశగా రంగారెడ్డి జిల్లా దూసుకుపోతున్నది. ఇప్పటికే ఐటీ, ఫార్మాసిటీ, ప్రైవేట్ సంస్థలు, తయారీ కేంద్రాలు ఉన్నాయి. మరో వైపు ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్రభత్వం సిద్ధమైంది. ఈ మేరకు స్థల సేకరణపై రెవెన్యూ శాఖ దృష్టి సారించింది. జిల్లాలోని పలు మండలాల్లో 1,513 ఎకరాల భూమి అందుబాటులో ఉందని ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఇందులో 1,170 ఎకరాలు అసైన్డ్భూమి ఉన్నట్లు తెలిసింది. ఈ భూమూలన్ని ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, కొత్తూర్ మండలాల రెవెన్యూ పరిధిలోనివి కావడం విశేషం. ఈ నాలుగు మండలాలు నగరానికి చేరువలో, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండడం ఒక కారణం. ఫుడ్ప్రాసెసింగ్యూనిట్లు ఏర్పాటైతే జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయి. స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడనుంది. ఉపాధి అవకాశాలు సైతం రెట్టింపు కానున్నాయి. ఇప్పటికే లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తుండగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తో మరో 10వేల మందికి ఉపాధి దొరకనుంది. ఆయా మండలాల్లో ఉన్న భూముల ధరలకు రెక్కలు వచ్చి రియల్ రంగం ఊపందుకోనుంది.
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: నగరానికి అతి దగ్గరలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఫుడ్ ప్రాసె సింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం స్థలాల ఎంపికపై దృష్టి పెట్టింది. ఒకవైపు ఫార్మాసి టీ, మరోవైపు ఐటీ పరిశ్రమలు, సర్వీస్ రంగం, తయారీ కేంద్రా లు ఏర్పాటుతో జిల్లా ఉపాధి కల్పనలో ముందంజలో ఉంది. వీటికి తోడు ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు చేస్తే జిల్లా రూపమే మారిపోనుంది. ఈ క్లస్టర్లతో స్ధానిక వ్యవసాయ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూ అన్వేషణలో నిమగ్నమైంది.
అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో అందుబాటులో ఉన్న భూ వివరాలపై ప్రభుత్వం ఆరా తీసింది. దీంతో జిల్లా రెవెన్యూ శాఖాధికారులు వివిధ ప్రాంతాల్లో 1,513 ఎకరాలు అందుబాటులో ఉందని నివేదిక రూపొందించారు. ఇందులో 1,170 ఎకరాల ఆసైన్డ్ భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. టీఎస్ ఎస్ఐసీసీ అధికారులు సైతం భూములను పరిశీలించినట్లు సమాచారం. ఫుడ్ ప్రాసె సింగ్ క్లస్టర్లకు గుర్తించిన స్థలాలపై న్యాయపరమైన చిక్కులు, కోర్టుల్లో వివాదాలు ఏమైనా ఉన్నాయా..? అని సర్కారు ఆరాతీసినట్లు తెలిసింది. ఎటువంటి వివాదాలు లేవని జిల్లా యంత్రాం గం సమాధానమిచ్చినట్లు సమాచారం.
స్థలాల గుర్తింపు ఇక్కడే..
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, కొత్తూర్ మండలాల రెవెన్యూ పరిధిలోని భూములను జిల్లా అధికారులు పరిశీలించారు. రెవెన్యూ అధికారులు భూ సర్వే చేసి ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తించారు. ఇబ్రహీంపట్నం మండలం ఖానాపూర్లో సర్వే నంబర్లు 43, 79, యాచారం మండలం కొత్తపల్లిలో సర్వే నంబర్ 317, మంచాల మండల తాళ్లపల్లిగూడలో సర్వే నంబర్ 84, కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్ 361, 252, 278 సర్వే నంబర్లలోని ప్రభుత్వ, అసై న్డ్ భూముల వివరాలను జిల్లా రెవెన్యూ శాఖ సేకరించింది. మొత్తం 1,513 ఎకరాలు అందుబాటులో ఉందని పేర్కొంది. ఇందులో 1,170 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు ఉండగా వీటిని రైతులు సాగు చేసుకుంటున్నారు. మిగిలినవి ప్రభుత్వ భూములు. ఈ మొత్తం భూముల విలువను కూడా లెక్కగట్టింది. ప్రభుత్వ ధర (ఎస్ఆర్వో) ప్రకారం సుమారు రూ.125 కోట్లు, మార్కెట్ ప్రకారమైతే రూ.414 కోట్లు ఉం టుందని తేల్చింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం నివేదికను రూపొం దిం చి ప్రభుత్వానికి అందజేసింది. ఒకటి రెండు రోజుల్లో ఆహార శుద్ధి క్లస్టర్ల ఏర్పాటుపై స్పష్టత రానుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రాధాన్యత ఎందుకు..?
ఈ నాలుగు మండలాలు నగరానికి అతి చేరువలో ఉండడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ సెజ్‌లు, ఎరోస్పేస్, రక్షణ రంగం సం లు, ఐటీ కంపెనీలతో పాటు ప్రతిపాదిత ఫార్మాసిటీ కూడా సమీపంలో ఉంది. ఈ మండలాల్లో ప్రభుత్వ భూములు కూడా అధికంగా ఉన్నాయి. ఈ సాను కూల అంశాల నేపథ్యంలో ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
ఉపాధి అవకాశాలు అధికం..
రంగారెడ్డి జిల్లాకు ఇప్పటికే పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఐటీ కంపెనీలు, ప్రైవేటు సంస్థలు, సెజ్‌ల ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. సుమారు లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు వస్తే ఉపాధి అవకాశాలు మరింత ఎక్కువ కానున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10వేల మందికి ఉపాధి దక్కుతుందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.కోట్లలో పెట్టుబడులు వస్తాయని చెబుతున్నాయి. మరోపక్క భూముల ధరలు మరింత పెరిగే వీలుంది. పరిశ్రమల సమీప ప్రాంతాల్లో రియల్ రంగం ఊపందుకునే అవకాశం ఉంది.