కుటుంబానికి కరోనా వస్తుందనే భయంతో పరారీ..!

by Shamantha N |
కుటుంబానికి కరోనా వస్తుందనే భయంతో పరారీ..!
X

దిశ, వెబ్‎డెస్క్:

తనకు కరోనా పాజిటివ్ రావడంతో తన కుటుంబసభ్యులకు వస్తుందేమో అని భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు ఓ వ్యక్తి. తమ ఇంటి పెద్ద ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు స్థానిక ఎమ్మెల్యే సహాయంతో ఆయన అడ్రస్ కనుగొన్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని కోల్‎కతాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కోల్‎కతాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తన ద్వారా కుటుంబసభ్యులకు వ్యాప్తి చెందుతుందని ఇంటికి రాలేదు. ఇంటి పెద్ద ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు బిధన్‎నగర్ ఎమ్మెల్యే సుజిత్‎బోస్‎ను ఆశ్రయించారు. దీంతో ఆయన స్థానిక కౌన్సిలర్‎కు బాధ్యత అప్పగించారు. సదరు కౌన్సిలర్ స్థానిక అధికారులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. సదరు వ్యక్తి కోల్‎కతాలోని దత్తాబాద్ ఎదురుగా ఉన్న ఈఎం బైపాస్‎లో మెట్రో స్తంభం కింద ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed