తెలంగాణ విద్యాశాఖ నిర్లక్ష్యం.. ఆందోళనలో టీచర్లు

by Shyam |   ( Updated:2021-12-11 02:37:11.0  )
తెలంగాణ విద్యాశాఖ నిర్లక్ష్యం.. ఆందోళనలో టీచర్లు
X

దిశ, మహాబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియంలో బోధించేందుకు టిఆర్ టి (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) నిర్వహించారు. వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చి ఉద్యోగంలో నియమించారు. అయితే ఈ ఉపాధ్యాయుల ఎంపిక, బదిలీలు, ప్రమోషన్స్ తో పాటు అన్ని రకాల ప్రభుత్వ కార్యకలాపాలు ఇంగ్లీషు మీడియం టిఆర్ టి ప్రకారం నిర్వహించాలి. కానీ ఈ ఉపాధ్యాయులను ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం లేదు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ను అమలు చేస్తున్నా, వీరిని ఇంకా తెలుగు మీడియం ఉపాధ్యాయులుగా గుర్తిస్తున్నారు.

తాజాగా రాష్ట్ర పరిధిలో ఉన్న ఉపాధ్యాయులను నూతన జిల్లాల వారిగా విభజన చేస్తున్నారు. స్థానికతతో సంబంధం లేకుండా సీనియారిటీ ఆధారంగా ఉమ్మడి జిల్లాల్లో సర్దుబాటు చేస్తున్నారు. ఈ నెల 10 వ తేదీ నుంచి ఉద్యోగులు, నూతన జిల్లాల క్రమంగా ఆప్షన్ ఫాం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో పని చేసే ఉద్యోగుల నుంచి నూతన జిల్లాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఎంపిక అయింది ఇంగ్లీష్ మీడియంలో కానీ, ఈ ఉపాధ్యాయులను తెలుగు మీడియం లో చూపడంతో వారు గందరగోళానికి గురవుతున్నారు.

మేము ఇంగ్లీష్ మీడియం ఉపాధ్యాయులం..

తెలుగు, ఉర్దూ మాధ్యమాల సీనియారిటీ జాబితా మాదిరిగానే ఆంగ్ల మధ్యమ సీనియారిటీ జాబితా ను ప్రభుత్వం రూపొందించాలి. మేము ఇంగ్లీష్ మీడియం రిక్రూట్మెంట్ లో ఎంపిక అయ్యాము. ఆంగ్ల మాధ్యమ టీచర్లను తెలుగు మీడియం జాబితా లో చూపడం సరైంది కాదు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఇంగ్లీషు మీడియం ఉపాధ్యాయులను ప్రత్యేకంగా గుర్తించాలి. ప్రతి జిల్లా కేంద్రాల్లో ఇంగ్లీష్ మీడియం పోస్ట్ లు ప్రకటించాలి. సూపర్ న్యూమరీ పోస్టు లు క్రియేట్ చేయాలి.

-కే.రామారావు, ఇంగ్లీష్ మీడియం ఉపాధ్యాయుడు. దంతాలపల్లి మండలం.

డిఈఓ ప్రకటన

ఇంగ్లీష్ మీడియం టీచర్లు అప్పీల్ చేసుకుంటే వారిని తెలుగు మీడియం నుండి తొలిగిస్తామని డిఈఓ అబ్దుల్ తెలిపారు. ఇప్పటికే 35 మంది అభ్యతరాల ఇచ్చారని, ఫైనల్ చేసి జాబితా ను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story