టెస్టు చాంపియన్‌షిప్ రేసులో అగ్రస్థానానికి ఇంగ్లాండ్

by Shyam |   ( Updated:2021-02-09 06:31:44.0  )
టెస్టు చాంపియన్‌షిప్ రేసులో అగ్రస్థానానికి ఇంగ్లాండ్
X

దిశ, స్పోర్ట్స్ : చెన్నైలో ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ రేసులో నాలుగవ స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకుంది. అదే సమయంలో ఘోర ఓటమిని కొని తెచ్చుకున్న కోహ్లీ సేన అగ్రస్థానం నుంచి ఏకంగా 4వ స్థానానికి పడిపోయింది. ఇంగ్లాండ్ జట్టు 422 పాయింట్లు సాధించి 70.2 విజయాల శాతంతో అగ్రస్థానంలో ఉన్నది.

ఇప్పటికే ఫైనల్ చేరుకున్న న్యూజీలాండ్ 70 శాతం విజయాలతో ఉంది. ఆసీస్ జట్టు (69.2) మూడవ స్థానంలో కొనసాగుతున్నది. టీమ్ ఇండియా 680 పాయింట్లతో 68.3 శాతం విజయాలతో నాలుగవ స్థానానికి పడిపోయింది. ఇండియా ఇప్పుడు టెస్టు ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన మూడు టెస్టుల్లో కనీసం రెండు గెలిచి.. ఒకటి డ్రా చేసుకోవాల్సింది. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఫైనల్స్ ఆశలు గల్లంతవుతాయి.

Advertisement

Next Story