- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఈడీ అఫిడవిట్ దాఖలు!

X
తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో సంచలనం రేపిన బంగారం అక్రమ రవాణా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. సీఎం పినరయి విజయన్ మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఐఏఎస్ ఆఫీసర్ ఎం.శివశంకర్‌కు బంగారం అక్రమ రవాణాకు సంబంధించిన అన్ని విషయాలు ముందే తెలుసునని.. ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ విచారణలో వెల్లడించినట్లు ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో ఈడీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది.
ఈ అఫిడవిట్ ప్రకారం, దౌత్యమార్గాల్లో చేసిన బంగారం అక్రమ రవాణా గురించి అప్పటి సీఎంవోలో ఉన్న శివశంకర్, ఆయన బృందానికి తెలుసునని స్వప్న సురేశ్ చెప్పారు. ఈ కేసులోని ప్రధాన నిందితులు సరిత్, సందీప్, స్వప్న సురేశ్‌లందరూ శివశంకర్‌కు ముఖ పరిచయమేనని, కీలక నిందితుడు యూఏఈ కాన్సులెట్ ఫైనాన్స్ హెడ్ ఖలీద్‌కూ తెలుసునని చెప్పుకొచ్చారు.
Next Story