- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ జిల్లాలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బుధవారం తెల్లవారు జామున కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో గ్రేహాండ్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహాండ్స్ బృందాలకు మావోయిస్టులు తరస పడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులతోపాటు, పార్టీకి చెందిన కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. తెలంగాణకు చెందిన సందె గంగయ్య మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఆయన ప్రస్తుతం డీసీఎం కమాండర్ గా కొనసాగుతున్నారు. సందె గంగయ్య దగ్గర నుంచి ఏకే47 తోపాటు, భారీగా మందుగుండ్లు, ఆయుధాలు, ఇతర సామగ్రిని గ్రేహాండ్స్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా దళాలు హెలికాప్టర్ ద్వారా తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటన స్థలానికి గ్రేహాండ్స్ బలగాలు భారీగా చేరుకుంటున్నాయి. అలాగే రోడ్డు మార్గాలను మూసేసి తనిఖీలు చేపడుతున్నాయి.