- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్యూటీ.. ఆఫీస్ బయటే!
దిశ, మేడ్చల్: కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాల్లో మార్పులొస్తున్నాయి. కరోనాకు ముందు వరకు ఆఫీసుల్లో అందరూ ఒకే చోట కూర్చుండి పనులు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఆఫీసుల్లో పనులు జరుగుతున్నాయి. ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే కొన్ని ఆఫీసుల్లో ఆరుబయటే విధులు నిర్వర్తిస్తున్నారు. దీనివల్ల కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కరోనా మహమ్మారి ఏ రూపంలో అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి ఉన్నందున పోలీస్, ఆర్టీఓ, రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్, పౌర సరఫరాల తదితర విభాగాలన్నీ ఇదే తరహాలో విధులు నిర్వహిస్తున్నాయి.
గదుల్లో ఉండట్లే..
కరోనాకు ముందు అధికారులు తమ ఛాంబర్‌లోనే ప్రజలతో మాట్లాడారు. ఇలా ఒక్కో సమస్యకు ప్రతి రోజు ఒకే సారి పదుల సంఖ్యలో జనాలను కలవాల్సి వచ్చేది. సమస్య తీవ్రతను బట్టి కొన్నిసార్లు గంటల తరపడి చర్చించాల్సి ఉండేది. కానీ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలతో మాట్లాడాలంటే ఆరుబయటనే కలుస్తున్నారు. ఎవరికైనా వైరస్ ఉంటే ఆఫీసులో వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులే ఆఫీసుల నుంచి బయటకు వస్తున్నారు. ఆరు బయటే వారి సమస్యలను విని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఎవరినీ రానివ్వట్లే..
తెలంగాణ సచివాలయంతో పాటు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలకు సైతం సందర్శకులను రానివ్వడంలేదు. రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలకు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్‌డీలకు కరోనా పాజిటివ్ రావడంతో అధికార యంత్రాంగం మరింత అలర్ట్ అయ్యింది. ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల ముందు ఓ బాక్స్‌ను ఏర్పాటు చేసి, ఆర్జీలన్నింటిని ఆ బాక్స్ లో వేయాలని సూచిస్తున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత బాక్స్‌లోని దరఖాస్తులు/ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నామని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విద్యాసాగర్ చెప్పారు.
కరోనా కట్టడి కోసమే: సంతోష్ కుమార్, ఇన్ స్పెక్టర్, శామీర్ పేట
నగరంలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వైరస్ ఎవరికి ఉందో తెలియని పరిస్థితుల్లో గదుల్లో కూర్చోని విధులు నిర్వహించడం కన్నా ఆరు బయటనే ప్రజల సమస్యలు విని పరిష్కరించడం బెటర్. లాక్ డౌన్ అమలు చేసినప్పటి నుంచి ఆరు బయటే కూర్చోని విధులు నిర్వర్తిస్తున్నాం. అదేవిధంగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం.