ఉద్యోగులు, ఉపాధ్యాయులు అరెస్ట్

by Shyam |
ఉద్యోగులు, ఉపాధ్యాయులు అరెస్ట్
X

దిశ, హైదరాబాద్: పీఆర్సీ సాధన కోసం 52 ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక సంఘాలు తలపెట్టిన చలో అసెంబ్లీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఉయదం 10.30 గంటల నుంచే నగరంలోని అనేక ప్రాంతాల నుంచి ధర్నా చౌక్ ఇందిరాపార్కుకు చేరుకుంటున్న ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. జిల్లాల నుంచి చలో అసెంబ్లీ కార్యక్రమానికి రాకుండా ఉండేందుకు మార్గమధ్యంలో అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వలయాలను, ఆంక్షలు, అడ్డుగోడలను దాటుకుంటూ భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు ఇందిరాపార్కుకు చేరుకున్నారు. నిరసనకు అనుమతి లేకున్నా.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల నిరసన పెద్ద ఎత్తున తెలియజేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి నగరంలోని గోషామహాల్ స్టేడియంతో పాటు పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇందిరాపార్కుతో పాటు బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్కు వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగింది.

Tags: PRC, Employees, Teachers Dharna, police arrests, indira park

Advertisement

Next Story

Most Viewed