ఆన్‌లైన్ ద్వారా అత్యవసర పాసులు: సీపీ సత్యనారాయణ

by Sridhar Babu |   ( Updated:2020-11-16 05:50:16.0  )

దిశ, కరీంనగర్: లాక్‌డౌన్ అమలవుతున్నందున అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వారికి ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే పాసులు ఇస్తామని సీపీ సత్యనారాయణ తెలిపారు. పాసుల కోసం వెబ్ లింక్‌ https://tsp.koopid.ai/epass,https://www.tspolice.gov.in/, http://ramagundampolice.in/లను ఉపయోగించి తాజా డాక్యుమెంట్లు, ఐడీ ప్రూఫ్లను అప్‌లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి ఆన్‌లైన్‌ ద్వారానే పాస్‌లు జారీ చేయడం లేదా తిరస్కరిస్తామని సీపీ వివరించారు.

Advertisement

Next Story