- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడేళ్లలో 142 శాతం పెరిగిన ఎలక్ట్రానిక్ వాహనాలు!
దిశ, వెబ్‌డెస్క్: గత మూడేళ్లలో దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రెండు రెట్లు పెరిగింది. ఈ-వాహన్ పోర్టల్ వివరాల ప్రకారం నమోదైన ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 2017-18 ఆర్థిక సంవత్సరంలో 69,012 యూనిట్ల నుంచి 2019-20 ఆర్థిక సంవ్త్సరానికి 1,67,041 యూనిట్లతో 142 శాతం పెరిగాయని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అర్జున్ రామ్ చెప్పారు. దీంతో గడిచిన మూడేళ్లలో దేశంలో విక్రయించిన మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 3.79 లక్షల యూనిట్లకు చేరుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ వ్యయం సాధారణ వాహనాల కంటే తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించడానికి ఫేమ్ ఇండియా పథకం ఫేజ్2 ద్వారా ప్రోత్సాహకాల మద్దతు ఇస్తున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల ప్రమోషన్ కోసం ప్రభుత్వం చొరవ తీసుకుంటొందని అర్జున్ రామ్ అన్నారు. ఇందులో జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాము. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. మౌలిక సదుపాయాలను ఏర్పాటు కోసం పెట్టుబడులను ఆకర్షించేందుకు భారీగా ప్రోత్సాహకాలను ఇస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.