- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో మళ్లీ ఓట్ల పండుగ
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని పల్లెల్లో ఓట్ల పండుగ రానుంది. వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, గ్రామ పంచాయతీలు, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చేనెల 3 నుంచి ఓటర్ల ముసాయిదాను విడుదల చేస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏప్రిల్ 3 నుంచి మొదలుకానున్న ఓటర్ల జాబితా ప్రక్రియ అదే నెల 15తో ముగియనుంది. 15న తుది జాబితాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం మే నెలలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నట్లు భావిస్తున్నారు.
ఎన్నికలు జరగాల్సిన ప్రాంతాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎంపీపీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మండల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరుగాల్సి ఉంది. వీటితో పాటుగా 24 ఎంపీటీసీ స్థానాలకు సైతం ఎన్నికలు జరుగాల్సి ఉంది. రాష్ట్రంలోని 20 గ్రామ పంచాయతీలకు మొత్తం స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. ఆదిలాబాద్జిల్లా బేల మండలం కబాయి, మనగ్రోడు, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నెన్నెల, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బండమీదిపల్లి, శంకరయ్యపల్లి తండా, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్, వంద్రుగూడ, నల్గొండ జిల్లా నకిరేకల్ మండం చందంపల్లి, చందుపట్ల, కడపర్తి, నెల్లిబండ, నోముల, తాటికల్, గొల్లగూడెం, నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలం గంగారం తండా, తిర్మన్‌పల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి, వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయలగూడెం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
వీటితో పాటుగా 97 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు, దాదాపు 980 గ్రామాల్లో 1083 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
మే నెలలో ఎన్నికలు
మే నెలలో గ్రామ పంచాయతీల ఎన్నికలను నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇదే నెలలో మినీ పురపోరుకు కూడా నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఒకేసారి వీటికి కూడా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి ఓటరు జాబితా ఫైనల్ చేయడంతో ప్రక్రియలో అడుగు ముందుకు పడినట్టే. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.
ఇదీ ఓటరు జాబితా షెడ్యూల్
ఏప్రిల్ 3 : ఓటరు జాబితా ముసాయిదా విడుదల
ఏప్రిల్ 6: జిల్లా స్థాయిలో అన్ని రాజకీయ పక్షాలతో జకలెక్టర్ల సమావేశం
ఏప్రిల్ 7 : మండల స్థాయిలో రాజకీయ పక్షాలతో ఎంపీడీఓల సమావేశం
ఏప్రిల్ 4 నుంచి 8 వరకు : ఓటరు జాబితాపై ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ
ఏప్రిల్ 10 : ఓటరు జాబితాపై వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం
ఏప్రిల్ 12 : గ్రామాలు, వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా జిల్లా స్థాయిల్లో ఆమోదం
ఏప్రిల్ 15: గ్రామాలు, వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా తుది జాబితా విడుదల