- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించండి: ఎన్నికల అధికారి శశాంక్
దిశ, మక్తల్: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని గరుడ యాప్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని, పోలింగ్ బూత్ పరిధిలో బీఎల్వోలో గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో చనిపోయిన వారి వివరాలకై ప్రతి ఇళ్లు తిరిగి ఆ వివరాలతో ఓటర్ లిస్ట్ నుంచి పేర్లను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఊట్కూరు మండల కేంద్రంలోని పలు పోలింగ్ బూత్ లను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. బూత్ ల పరిధిలో ఎంత మంది నమోదు చేశారు.. చనిపోయినవారి వివరాల గురించి అడగ్గా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. చనిపోయినవారి వివరాలు ఓటర్ లిస్ట్ నుండి తొలగించేముందు జాగ్రత్తలు పాటించాలని.. అందుకు అధికారులు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ హరిచందన, ఎస్పీ చేతన, ఆర్డీవో వెంకటేశ్వర్లు, స్థానిక ఎమ్మార్వో, ఎస్సై, అధికారులు ఉన్నారు.