- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్‌లో పొలిటికల్ పార్టీలకు షాకిచ్చిన ‘ఈసీ’..
దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ బై పోల్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, స్టార్ క్యాంపేనర్స్, ఆయా పార్టీల నాయకులెవరూ కూడా మీడియా సమావేశాలు నిర్వహించొద్దని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ స్పష్టంచేశారు. హుజురాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి మీటింగుల వలన ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉండటంతో నియోజకవర్గంలోనే కాదు.. రాష్ట్రంలోనే సమావేశాలను అనుమతి లేదన్నారు. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. మాస్క్ లేకుండా ఓటు వేసేందుకు అనుమతి లేదన్నారు. సైలెన్స్ పీరియడ్‌లో మద్యం, డబ్బుల పంపిణీ గురించి చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు. 10 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 10 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్నుఏర్పాటు చేశామని వివరించారు. గురువారం రాత్రి రూ. 6 లక్షలు పట్టుకున్నామని, 130 కేసులు ఇప్పటి వరకు నమోదు చేశామన్నారు. వికలాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లు ప్రతీ బూత్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. వృద్దుల కోసం ప్రత్యేక లైన్లు, కరోనా రోగుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
అడిగినా నేరమే..
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదుతో పాటు ఇతరాత్ర ఏమైనా పంచినా, ఓటు వేసేందుకు తమకు డబ్బులు ఇవ్వాలని అడిగిన వారిపై కూడా కేసు పెడతామని కరీంనగర్ సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. డబ్బులు అడిగినందుకు 3 కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటివరకు రూ. 3.50 కోట్ల మేర నగదు సీజ్ చేశామని, కొవిడ్ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కూడా 130 కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు సంబంధించి 6 కేసులు నమోదు చేశామని, ఓటర్లకు ప్రభావితం చేసేలా ఉండే ప్రతి పోస్టుపైనా నిషితంగా గమనిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 3 టీమ్స్‌ను రంగంలోకి దింపామన్నారు. సైలెన్స్ పీరియడ్‌లో నాన్‌లోకల్ లీడర్లు ఉండకూడదన్న నిబంధనలను అనుసరించి ఇప్పటివరకు 4 వేల మందిని తిప్పి పంపించామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీపీ చెప్పారు.